మామూలురోజుల్లో హైదరాబాదులో జీవితం ఓ భోగం
వాన వచ్చిందంటే వస్తుంది దానికి ట్రాఫిక్ జామ్ అనే ఓ అంటు రోగం
ఆ భోగానికి అంతులేదు... ఈ రోగానికి మందులేదు...
అనుభవించినవారికే తెలుస్తుంది నగరంలో వర్షం వైభోగం....!!!!!!
Saturday, August 20, 2011
దిట్టకవిత్వం
ఎప్పుడో చిన్నప్పుడు సృష్టించుకున్నా...
నాకంటూ ఓ చిన్ని ప్రపంచం...
అందులో రాకుమారిని నేనే ఇష్టసఖిని నేనే
నాలో నేను...నాకై నేను..
కథల లోకంలో తిరిగా
ఊహల ఊయల ఊగా
కవితల దారిన కదిలా
పాటల పల్లకి తేలా
ఒక్కొక్కరుగా వచ్చారు ఇంకెందరో యువరాణులు..
అయ్యారు నా ప్రపంచంలో భాగస్వాములు
వాళ్లతో నేను నాతొ వాళ్ళు...
కలిసి నడుస్తున్నాం ఎన్నో మైళ్ళు
యువరాణులు..మహరాణులయ్యారు...
మహారాజుల పట్రానులయ్యారు...
ఆయినా సాగుతోంది ఈ మైత్రి బంధం...
విడదీయరాని చిన్ననాటి అనుబంధం....
నాకంటూ ఓ చిన్ని ప్రపంచం...
అందులో రాకుమారిని నేనే ఇష్టసఖిని నేనే
నాలో నేను...నాకై నేను..
కథల లోకంలో తిరిగా
ఊహల ఊయల ఊగా
కవితల దారిన కదిలా
పాటల పల్లకి తేలా
ఒక్కొక్కరుగా వచ్చారు ఇంకెందరో యువరాణులు..
అయ్యారు నా ప్రపంచంలో భాగస్వాములు
వాళ్లతో నేను నాతొ వాళ్ళు...
కలిసి నడుస్తున్నాం ఎన్నో మైళ్ళు
యువరాణులు..మహరాణులయ్యారు...
మహారాజుల పట్రానులయ్యారు...
ఆయినా సాగుతోంది ఈ మైత్రి బంధం...
విడదీయరాని చిన్ననాటి అనుబంధం....
Subscribe to:
Comments (Atom)