Saturday, March 19, 2011
జ్ఞాపకాల దొంతరలు...1
మొన్న సరదాగా కాసేపు గడుపుదామని హంసీ దగ్గరికి వెళ్ళాను. అప్పటికి అది ఇంకా నాలుగో తరగతిలోనే ఉంది. మా కబుర్ల మధ్యలోకి అమ్మ వచ్చి నేను ఆ వయసులో ఎలా ఉండేదాన్నో చెప్పటం మొదలు పెట్టింది. కాసేపు విని హంసీ , "ఆమ్మా! నువ్వు 4th class ఏ సంవత్సరంలో చదివుంటావు ... అమ్మమ్మకి ఇంకా అన్నీ ఎలా గుర్తున్నాయి? అసలు మీకు హోం వర్క్ ఇచ్చేవాళ్ళు కాదా? ఎప్పుడూ ఆటల గురించి , చేసిన కోతి పనుల గురించే చెబుతావు? మీరంతా హాయిగా దోస్తులతో సరదాగా గడిపేవాళ్ళు. మీకు వర్క్ షీట్స్ లేవా " అని అడిగింది. దాని ప్రశ్నలు వింటుంటే "మేమెంత అదృష్ట వంతులమో కదా...మాకు ఈ చింతలే లేవే ... ఆడుతూ పాడుతూ పెరిగాము. ఈ కాలం పిల్లలు ఎన్ని కోల్పోతున్నారు " అన్న బాధ మనసుని కమ్మేసింది. ౪ గంటలకి స్కూల్ అయిపోగానే పరిగెత్తి ఇంటికి రావటం ... మళ్ళి వెంటనే అమ్మ పెట్టిన జంతికలు , గిన్నప్పచ్చులూ తిని గబా గబా బాల భవన్ కి వెళ్ళాక పొతే ... అమ్మో!!ఇంకేమైనా ఉందా? కొత్త పుస్తకాలు శ్యామలా ఆంటీ ఎవరికైనా ఇచ్చేస్తుందేమో.. బ్రహ్మాజీ ఆంటీ కొత్త స్వరం చ్చేప్పేస్తారేమో .... ఎంత బెంగ...ఒకవేళ అవన్నీ లేకపోయినా ఉయ్యాల దొరుకుతుందో లేదో అన్నతపన ....ఇలా రాసుకుంటూ పొతే ఎన్నని???
Subscribe to:
Post Comments (Atom)
yE kaalaaniki adE goppa. mee vayasulO school + baal bahavn maatramE lOkam. Ipuudu inka chaalaa + lu vastunnai. But appuDoo manchi, naasi rakam saruku vacchindi. ippuDoo alaagE mishramangaa vastundi.
ReplyDelete